డెన్మార్క్ ఓపెన్ 2018లో క్వార్టర్ ఫైనల్ చేరడానికి జపనీస్ బ్యాడ్మింటన్ క్వీన్ అకానే యమగుచీతో హోరాహోరీగా పోరాడి విజయం సాధించిన సైనా నెహ్వాల్... క్వార్టర్స్‌లో వరల్డ్ నెం. 7 ఒకుహారాతోనూ మంచి రసవత్తరపోరులో గెలుపొందింది. దాదాపు 58 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ను 17-21, 21-16, 21-12 తేడాతో సొంతం చేసుకున్న సైనా నెహ్వాల్ సెమీస్ చేరుకుంది. 2017 వరల్డ్ ఛాంపియన్షిప్, ఆసియాకప్, కొరియా ఓపెన్లలో సైనా నెహ్వాల్‌ను ఓడించిన ఒకుహారాపై ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకోగలిగింది సైనా.