భారత బ్యాడ్మింటన్ క్వీన్స్ పీవి సింధు, సైనా నెహ్వాల్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 5వ సీజన్ వేలంలోనూ జాక్ పాట్ కొట్టారు. భారత బ్యాడ్మింటన్ లీగ్ 2018-19 సీజన్ వేలంలో సింధు సొంతగూటికి చేరగా...సైనాను ఈశాన్య రాష్ట్రాల ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. హైదరాబాద్ హంటర్స్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ ఫ్రాంచైజీలు వేలంలో చెరో 80 లక్షలతో సింధు, సైనాలను దక్కించుకున్నాయి. కొత్త ఫ్రాంచైజీల తరఫున ఆడటానికి తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని సింధు,సైనా ధీమాగా చెప్పారు.