HOME » VIDEOS » Sports

Video: ప్రధాని మోదీ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని చెప్పి...జనగామ జిల్లాలో ఘరానా మోసం...

క్రైమ్19:51 PM July 12, 2019

తెలంగాణలోని జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామంలో భారీ స్కాం వెలుగుచూసింది. నమిలిగొండ గ్రామం జనగామా జిల్లాలో కలిసినందు వల్ల జిల్లా పేరును ఆదార్ కార్డులో మారుస్తున్నామని వచ్చిన కొందరు హ్యాకర్లు ప్రజల నుంచి ఆదార్ నెంబర్లు తీసుకున్నారు. అలాగే ప్రజలందరికీ పీఎం నరేంద్ర మోదీ డబ్బులు వేస్తున్నారని చెప్పడంతో అందరూ నమ్మి వారి ఆదార్ నెంబర్ తో పాటు వేలి ముద్రలు ఇచ్చారు. అందరి నెంబర్లను తీసుకున్న హ్యాకర్లు వెంటనే వారి ఖాతాల నుంచి డబ్బులు మాయం చేశారు. దీంతో ఊరి ప్రజలంతా లబోదిబో మన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతా నుంచి 600 రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ లు రావడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు.

webtech_news18

Top Stories