ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన పీవీ సింధు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆమెకు తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఘన స్వాగతం పలికారు. సింధుకు స్వాగతం పలికేందుకు బ్యాడ్మింటన్ అభిమానులు తరలివచ్చారు. సింధు వెంట ఆమె తండ్రి పీవీ రమణ, కోచ్ పుల్లెల గోపీచంద్ ఉన్నారు. అనంతరం బేగంపేట నుంచి గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీకి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన పీవీ సింధు..ఈ విజయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.