భారతజాతి ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చాటిన తెలుగుతేజం పీవీ సింధును ప్రధాని మోదీ ఘనంగా సత్కరించారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన సింధును మోదీ అభినందించారు. మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న పీవీ సింధు ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు. ఆమె వెంట కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధూను ఈ సందర్భంగా అభినందించారు మోదీ. మెడల్ పసిడి పతకాన్ని వేసి సత్కరించారు.