ఆసియా కప్‌లో హాంగ్‌కాంగ్‌తో తొలి మ్యాచ్‌లో భారత్ నెగ్గితే...మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా క్రికెటర్లు అందరి హృదయాలు గెలుచుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో చెమటోడ్చి నెగ్గింది. మ్యాచ్ అనంతరం భారత క్రికెటర్లు హాంగ్‌కాంగ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఆటగాళ్లను అభినందించారు. టీమిండియా క్రికెటర్లతో సెల్ఫీలు దిగి సంబరపడిపోయారు.