విండీస్‌లో జరిగిన రెండో టీ20లో సెంచరీ చేసి, పొట్టిఫార్మాట్లో అత్యధికంగా నాలుగు శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ... మరో పెద్ద రికార్డుకు 69 పరుగుల దూరంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో ఆదివారం జరగబోయే ఆఖరి టీ20లో రోహిత్ ఈ పరుగులు సాధిస్తే... అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ మ్యాచ్‌లో కాకపోయిన తర్వాత ఆసీస్ సిరీస్ కూడా ఉండడంతో రోహిత్ టాప్‌లో నిలిచే అవకాశముంది.