హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: తొలి సెంచరీని తల్లికి అంకితమిచ్చిన రవీంద్ర జడేజా...

క్రీడలు00:33 AM October 06, 2018

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీతో అలరించాడు భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. 5 ఫోర్లు, 5 సిక్సర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అంతర్జాతీయ కెరీర్లో జడేజాకి ఇదే తొలి సెంచరీ. తనకెంతో ప్రత్యేకమైన ఈ శతకాన్ని తన తల్లికి అంకితమిచ్చాడు జడ్డూ. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన సమావేశంలో ‘నేను టీమిండియాకు ఆడాలనేది మా అమ్మ కల. నేను జట్టులో స్థానం దక్కించుకునే సమయానికి తను నాతో లేదు... మా అమ్మ ఇప్పుడు నాతో లేకపోయినా, ఆమె దీవెనలు ఎప్పుడూ నావెంటే ఉంటాయి. అందుకే నా సెంచరీని అమ్మకి అంకితం ఇస్తున్నా...’ అంటూ ఎమోషనల్‌గా చెప్పాడు జడేజా.

Chinthakindhi.Ramu