హోమ్ » వీడియోలు » క్రీడలు

VIDEO : అజర్ అలీ మరీ అంత కామెడీగా రనౌటయ్యాడా...

క్రీడలు17:35 PM October 19, 2018

అజర్ అలీ రనౌటైన విధానాన్ని సోషల్ నెట్‌‌వర్కింగ్ సైట్లలో కొంతమంది అభిమానులు ఘాటుగా విమర్శించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరెవ్వరూ అజర్‌ అలీలా ఔటవ్వరని కొంతమంది ఫన్నీగా సెటైర్లు కూడా వేస్తున్నారు. బౌండరీ లైన్ దాటిందనుకున్న అజర్ అలీ, నాన్ స్ట్రైక్ బ్యాట్స్‌మెన్ షఫీక్‌తో పిచ్ మధ్యలోకి వచ్చి ముచ్చట్లు పెట్టాడు. కానీ బంతి బౌండరీ లైన్‌కు ముందే ఆగిపోవడాన్ని గ్రహించిన ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్ టిమ్ పెయిన్...బంతి అందుకున్న వెంటనే వికెట్లు పడగొట్టాడు. షఫీక్‌తో ముచ్చట్లలో మునిగిపోయిన అజర్...ఇదంతా చూసి షాక్ తిన్నాడు. అంపైర్ ఔట్‌ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాలు జరుపుకున్నారు. ఊహించని రీతిలో రనౌటైన విషయాన్ని గ్రహించిన అజర్ నిరాశలో పెవిలియన్ చేరుకున్నాడు.

webtech_news18