అమెరికన్ ఓపెన్ టెన్నిస్ తొలి రౌండ్ మ్యాచ్‌లో గ్రాండ్‌స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ ఆట చూసి అభిమానులు మాత్రమే కాదు హాలీవుడ్ హీరో హ్యూ జాక్మన్ సైతం మంత్రముగ్దుడయ్యాడు.నిషియోకాతో జరిగిన ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లో ఫెదరర్ కొట్టిన ఓ క్రాస్ కోర్ట్ షాట్‌కు హ్యూ జాక్మన్ ఫిదా అయ్యాడు.37 ఏళ్ల వయసులోనూ ఫెదరర్ కొట్టిన షాట్లను చూసి అవాక్కయాడు.