Monsoon Health Tips : ఐస్ క్రీం అందరికీ ఇష్టమైన ఆహారం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. వేసవిలో ఐస్ క్రీం ఎక్కువగా తింటారు. వేసవిలో ఐస్ క్రీం తినడం వల్ల పెద్ద సమస్య ఉండకపోవచ్చు. అయితే వర్షాకాలంలో ఐస్‌క్రీం తీసుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.