అర్జెంటీనా స్ట్రైకర్ లయనెల్ మెస్సీ, పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానొ రొనాల్డో...ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పరిచయమే అక్కర్లేని పేర్లు. ఈ ఇద్దరు మేటి ప్లేయర్లు ప్రస్తుతం సాకర్ వరల్డ్‌లో అత్యుత్తమ ఆటగాళ్లుగా వెలుగొందుతున్నారు. గత పది సీజన్ల నుంచి ఇంటర్నేషనల్ సాకర్‌లో గోల్స్ నమోదు చేయడంలో మెస్సీ, రొనాల్డోనే ముందున్నారు.