మహేంద్రసింగ్ ధోనీ, సాక్షి సంగ్ జంట గారాల కూతురికి సోషల్ మీడియా క్రేజ్ మామూలుగా ఉండదు. జివా తల్లి సాక్షి సింగ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే కూతురి ఫోటోలకు వేలల్లో లైక్స్, షేర్స్ వస్తుంటాయి. అంతేనా మహేంద్రుడి సోషల్ మీడియా అకౌంట్లలోనూ చాలా భాగం కూతురే ఆక్రమించుకుని ఉంటుంది. జివాకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పేజీలు, గ్రూపులు కూడా వచ్చాయంటే ధోనీ కూతురికి ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జివాసింగ్ కోసం ప్రత్యేకంగా ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా క్రియేట్ చేసింది సాక్షి. తాజాగా ఈ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ వీడియో, ధోని అభిమానులను ముఖ్యంగా జివా సింగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.