ఇనాయత్ మంజూర్ కాశ్మీర్‌కు చెందిన అమ్మాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇనాయత్ పేరు మారుమోగిపోతుంది. ఇందుకు కారణం 20 ఏళ్ల తర్వాత కాశ్మీర్ నుంచి ఓ అమ్మాయి జాతీయ క్రీడ అయిన హాకీలో రాణించడమే. క్రల్పొరా తెహ్సీల్ చదూర జిల్లా బుడ్గమ్కు చెందిన ఇనాయత్ నేషనల్ హకీ చాంఫియన్ షిప్లో పాల్గొంది. ప్రభుత్వ మహిళ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న ఇనాయత్ మిడిల్ క్లాస్‌కు చెందిన అమ్మాయి.