HOME » VIDEOS » Sports

అల వైకుంఠపురములో కన్నుల పండువగా పార్వేట ఉత్సవం...

ఆంధ్రప్రదేశ్10:32 AM January 17, 2020

కనుమ సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవాన్ని టీటీడీ అంగరంగవైభవంగా నిర్వహించింది. ఆరాధన, హారతి నివేదన అనంతరం మలయప్పస్వామి వేటకు బయల్దేరారు. స్వామివారి తరఫున అర్చకులు 3 సార్లు బాణాలు ప్రయోగించి.. వేట సన్నివేశాన్ని కళ్లకు కట్టారు. సాయంత్రం స్వామివార్లు ఆలయానికి చేరుకోవడంతో ఈ వేడుక ముగిసింది. ఉదయం 4.15 గంటలకు కాకబలిలో భాగంగా తోమాల, కొలువు సేవల మధ్య విమాన వేంకటేశ్వరుడికి పసుపు, కుంకుమ వేర్వేరుగా కలిపిన అన్నాన్ని నివేదించారు. గోదా పరిణయోత్సవం సందర్భంగా మూల విరాట్‌కు గోదా మాలలను అలంకరించారు.

webtech_news18

Top Stories