భారత రెజ్లర్ రితూ ఫోగట్ ఫిట్నెస్ గోల్స్ సెట్ చేస్తోంది. ప్రస్తుతం భారత్‌లోనే అత్యుత్తమ మహిళా వస్తాదుగా ఉన్న రితూ ఫోగట్ తన ఫిట్నెస్ కాపాడుకునేందుకు, సామర్ధ్యం పెంచుకునేందుకు ప్రతీ రోజూ మూడు గంటల పాటు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుంది. 2016 కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన రితూ ఫోగట్...ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తోంది.