దీపా మాలిక్... ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఆమె సాధించిన విజయాలు మాత్రం అసాధారణం. పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్ దీపా మాలిక్. 2016 సమ్మర్ పారాలింపిక్స్‌లో షాట్ పుట్ ఈవెంట్లో సిల్వర్ సాధించిన దీపా మాలిక్, 2018 పారా అథ్లెటిక్ గ్రాండ్ ఫిక్స్‌లో స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఎఫ్ 53 కేటగిరిలో ప్రపంచంలోనే నెం. 1 అథ్లెట్‌గా ఉన్న దీపా మాలిక్... 36 సెకన్స్ ప్లాంక్ ఛాలెంజ్ స్వీకరించారు. వీల్‌ఛైర్‌కి మాత్రమే పరిమితమైన దీపా మాలిక్... అతి కష్టం మీద దాన్ని పక్కన బెట్టి ఈ ఛాలెంజ్ పూర్తి చేశారు. ఈ ఛాలెంజ్ వీడియోల ద్వారా వచ్చిన మొత్తాన్ని బజాజ్ అలియాజ్ గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు సాయం చేస్తుందన్న విషయం తెలిసిందే.