భారత బ్యాడ్మింటన్ స్టార్స్ బంగారు ఆశలతో 2018 ఆసియా గేమ్స్‌కు సన్నద్ధమయ్యారు.ఆసియా గేమ్స్‌లో అంచనాలకు మించి రాణించాలని ఆశిస్తూ భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండోనేసియా పయనమైన ఇండియన్ ప్లేయర్స్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్లేయర్స్ అందరూ పతకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.పీవి సింధు,సైనా నెహ్వాల్,అశ్విని పొన్నప్ప,కిదాంబి శ్రీకాంత్,ప్రణోయ్,సిక్కి రెడ్డి,సాత్విక్ సాయిరాజ్ ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధిస్తామని ధీమాగా చెప్పారు.