26/11 ముంబై దాడి జరిగి ఈ ఏడాదికి పదేళ్లు పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని జవహార్ లాల్ స్టేడియంలో ఎన్ఎస్జీ సంస్థ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ హాజరుకానుంది. నవంబర్ 18న జరగనున్న ఈ హాఫ్ మారథాన్‌కు పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చి, ముంబై దాడి మృతులకు నివాళులు అర్పించాలని సైనా నెహ్వాల్ సోషల్ మీడియా ద్వారా కోరింది.