భారత్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్... రంజీ ట్రోఫీ 2018-19లో ఆడుతున్న సంగతి తెలిసిందే. బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా బ్యాటింగ్‌లో మాత్రం దూసుకుపోతున్నాడు బరోడా ఎక్స్‌ప్రెస్. జమ్ముకశ్మీర్ జట్టు తరుపున ఆడుతున్న ఇర్ఫాన్ పఠాన్... ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస బంతుల్లో నాలుగు వరుస సిక్సర్లు సాధించాడు ఇర్ఫాన్ పఠాన్. 76 బంతుల్లో 91 పరుగులు చేసిన పఠాన్ ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా ఇప్పటికే రంజీ ట్రోఫీలో 44.14 సగటుతో 309 పరుగులు సాధించాడు ఇర్ఫాన్ పఠాన్.