విండీస్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరే సాధించిన విండీస్... రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండు ఇన్నింగ్స్‌లోనూ సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ విండీస్ పతనాన్ని శాసించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన ఉమేశ్, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు.