హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: మెల్‌బోర్న్‌లో విరాట్ కోహ్లీ అండ్ గ్యాంగ్ విక్టరీ సెలబ్రేషన్స్...

క్రీడలు11:41 AM IST Dec 30, 2018

‘బాక్సింగ్ డే’ టెస్ట్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో 137 పరుగుల తేడాతో చిత్తుచేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది విరాట్ సేన. ఐదో రోజు వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ ప్రారంభమవుతుందా? లేదా అనే అనుమానం కలిగింది సగటు అభిమానుల్లో... అయితే టీ20 సిరీస్‌లో ఆసీస్‌కు ఫేవర్‌గా నిలిచిన వరుణుడు... ఈసారి మాత్రం భారత జట్టు కోసం కొద్దిసేపటి తర్వాత సైడ్ అయిపోయాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోర్ 258/8 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్... మరో మూడు పరుగులు జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. విజయం తర్వాత స్టేడియం మొత్తం తిరుగుతూ విక్టరీ సెలబ్రేషన్స చేసుకున్నారు విరాట్ కోహ్లీ అండ్ టీమ్... (video Courtesy: twitter/BCCI)

Chinthakindhi.Ramu