HOME » VIDEOS » Sports

India vs Pakistan: పాక్‌పై గెలిచిన భారత్.. సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే..

క్రీడలు11:32 AM June 17, 2019

India vs Pakistan: మరో సారి భారత్‌దే ఆధిపత్యం.. పాక్‌కు పరాభవం తప్పలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయిలో ఉన్న నేపథ్యంలో.. మ్యాచ్ అంటే ఉత్కంఠ, ఉద్వేగం ఎలా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం నాడు భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దాయాది జట్టుపై టీమిండియా పూర్తి ఆధిపత్యం సాధించి, జయకేతనం ఎగురవేసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఈ గెలుపుతో యావత్తు భారతదేశం పండుగ చేసుకుంది. మ్యాచ్ గెలవగానే రోడ్ల మీదకు వచ్చిన యువకులు, క్రికెట్ అభిమానులు.. జాతీయ జెండా పట్టుకొని జయహో భారత్, హిందూస్థాన్ జిందాబాద్, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా సహా అనేక ప్రధాన నగరాల్లోని రోడ్లపై ఆదివారం రాత్రి పండుగ వాతావరణం నెలకొంది.అంతేకాదు, లండన్‌లోని బెల్‌గ్రేవ్ రోడ్లన్నీ భారత క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిపోయాయి.

Shravan Kumar Bommakanti

Top Stories