టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. వన్డేల్లో వేగంగా 10 వేల పరుగులను అధిగమించిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేసిన విరాట్... అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 37 సెంచరీలు నమోదుచేసిన క్రికెటర్‌గానూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 205 ఇన్నింగ్స్‌ల్లోనే కొహ్లీ 10 వేల పరుగుల మార్క్ దాటి వన్డే ఫార్మాట్లో హిస్టరీ క్రియేట్ చేశాడు. ‘ఈ ఫీట్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. అయితే రికార్డుల గురించి నేనెప్పుడూ ఆలోచించను. జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం’ అంటూ వ్యాఖ్యానించాడు కోహ్లీ...