వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని అతి సులువుగా చేధించింది భారత జట్టు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వికెట్‌కి రికార్డు స్థాయిలో 246 పరుగులు జోడించడం, టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. వన్డేల్లో రెండో వికెట్‌కి భారత్‌కి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కాగా, ఓవరాల్‌గా సెకండ్ బెస్ట్. వీరిద్దరి మధ్య ఇప్పటికే 15 సార్లు శతక భాగస్వామ్యాలు, 5 సార్లు ద్విశతక భాగస్వామ్యాలు నమోదు కావడం విశేషం. ‘రోహిత్ శర్మతో ఆడుతున్నప్పుడు నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తాను....’ అంటూ మ్యాచ్ తర్వాత తమ మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు కోహ్లీ.