గౌహతి వన్డేలో చెలరేగిపోయాడు విరాట్ కోహ్లీ... బౌండరీల మీద బౌండరీలు సాధిస్తూ 88 బంతుల్లోనే సెంచరీ నమోదుచేశాడు. మొత్తంగా 107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లతో 140 పరుగులు చేసిన విరాట్, వన్డేల్లో 36వ సెంచరీ నమోదుచేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడీ పరుగుల సునామీ.