ఆదివారం జరిగే పాకిస్తాన్-ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. పనులన్నీ మానుకొని టీవీలకు అతుక్కుపోయేందుకు భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా గెలవాలంటూ దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు అభిమానులు. కొహ్లీ సేన విజయం కోసం వారణాసిలోని గంగా తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానికులు.