బిగ్ బాస్ 3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై జరిగిన దాడి సంచలనం సృష్టించింది. పబ్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో రాహుల్‌ను కొట్టారు కూడా. అందులో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి ఉన్నాడని రాహుల్ చెప్పాడు. వాళ్లు కావాలని తనపై దాడి చేసారని.. పబ్‌లో జరిగిన గొడవలో తన తప్పేం లేదని చెప్పాడు ఈ సింగర్. మీడియా ముందుకు వచ్చి కూడా ఈయన తన గోడు వెల్లబోసుకున్నాడు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని తనపై కావాలనే దురసుగా ప్రవర్తించారని.. అలా అయితే ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించాడు ఈయన. ఈ గొడవపై ఇప్పుడు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసాడు రాహుల్. ఈ సారి ఏకంగా అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన సిసిటీవీ ఫుటేజ్ ట్వీట్ చేసాడు.