కొన్నాళ్లుగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి తీరుపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ ఏం చెబితే దానికి శాస్త్రీ తలూపుతున్నాడనే విమర్శ కూడా వచ్చింది. దీనిపై తాజాగా సమాధానం చెప్పిన విరాట్... ‘నేను ఏదైనా చెబితే దానికి ఎక్కువగా నో చెప్పేది రవిశాస్త్రీయే. క్రికెట్ అందరికంటే ఎక్కువగా ఆయనే నన్ను విమర్శించారు. శాస్త్రి చెప్పిన సూచనలను వినడం వల్లే నా ఆటతీరు ఎన్నో రెట్లు మెరుగుపడింది..’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.