టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ కూతురు హినయా సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద స్టార్ అయిపోయింది. హర్భజన్ సింగ్, గీతాబస్రాల గారాల పట్టి అయిన హినయా చేసే సందడి అంతా ఇంతా కాదు. భజ్జీ లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో హినయా కోసం గీతా బస్రా పిల్లల సైకిల్‌పై సాహసం చేసింది. కూతురి కోసం పాట్లు పడుతున్న గీతాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.