హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: గౌతమ్ గంభీర్‌‌కు ఆఖరి ఇన్నింగ్స్‌లో గార్డ్ ఆఫ్ హానర్...

క్రీడలు17:03 PM December 09, 2018

టీమిండియా మాజీ ఓపెనర్, క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు తరుపున చివరి మ్యాచ్ ఆడాడు గంభీర్. చివరి మ్యాచ్‌లో సెంచరీ సాధించి... 43వ ఫస్ట్ క్లాస్ శతకంతో క్రికెట్‌కు ఫర్ఫెక్ట్ గుడ్‌బై చెప్పాడు గంభీర్. 185 బంతుల్లో 112 పరుగులు చేసిన గంభీర్‌కు ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్ జట్టు ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్‌’తో స్వాగతం పలికారు. గంభీర్ క్రీజులోకి వస్తున్న సమయంలో రెండు వైపులా నిల్చొని... సగర్వంగా ఆహ్వానించారు ఆంధ్రా క్రికెటర్లు. మొత్తంగా 198 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన గంభీర్... 54 సగటుతో 6,200 పరుగులు చేశాడు.

Chinthakindhi.Ramu