రాజ్‌కోట్ టెస్ట్‌లో భారత్ భారీస్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఆరంగ్రేటం కుర్రాడు పృథ్వీషా సెంచరీతో చెలరేగగా... ఛతేశ్వర్ పూజారా 86 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే పూజారా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చేసిన ఓ పని ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగిన పూజారా... మళ్లీ దాన్ని ప్యాంట్ జేబులో భద్రంగా దాచుకున్నాడు. అయితే ప్యాంట్ జేబులో వాటర్ బాటిల్ పెట్టుకుని బ్యాటింగ్ చేసిన పూజారా... సెంటిమెంట్ కోసం అలా చేశాడా? ఎండ వేడిని తట్టుకోలేక అలా చేశాడా... అనేది తెలియాల్సి ఉంది.