అందరి కంటే భిన్నంగా, విభిన్నంగా ఆలోచిస్తుంటాడు భారత మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ. ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు పొందిన మాహీ స్ట్రాటెజీని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు ధోనీ. రెండేళ్ల నిషేధం తర్వాత ఎంట్రీ ఇచ్చి 2018 టైటిల్ గెలిచిన సీఎస్కే (చెన్నై సూపర్ కింగ్స్) జట్టులోని 22 మంది ఆటగాళ్లను అట్టేపెట్టుకుంది. కేవలం ముగ్గురిని మాత్రమే వేలానికి పంపించింది.