ఐపీఎల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్-కోల్కతా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూసేందుకు వెళ్లి.. ఓ గ్యాంగ్ నానా హంగామా చేసింది. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తూ పక్క సీట్లలో కూర్చున్నవారిని ఇబ్బందిపెట్టారు. వారి న్యూసెన్స్తో ఆ గ్యాలరీలోని ప్రేక్షకులు మ్యాచ్ను ప్రశాంతంగా తిలకించలేకపోయారు. ఉప్పల్ స్టేడియంలో వీరు చేసిన న్యూసెన్స్ వీడియో రూపంలో బయటకొచ్చింది. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఓ యువతి వెగటు పుట్టించేలా ప్రవర్తించడం ఇతర ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 341, 188, 506ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో మాదాపూర్కి చెందిన టీవీ యాంకర్ చింతల ప్రశాంతి, అమీర్పేట్కి చెందిన కందుకూరి ప్రియ, కందుకూరి పూర్ణిమ, నాగోల్కి చెందిన గుర్రం వేణు, దిల్సుఖ్నగర్కి చెందిన శ్రీకాంత్ రెడ్డి, మాదాపూర్కి చెందిన లక్కపల్లి సురేశ్ ఉన్నారు. స్టేడియంలో సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో వీరు అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం.