వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్గా నిలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఆమె సీఎంను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం జగన్ శాలువాతో సత్కరించారు.సింధూ తనకు దక్కిన బంగారు పతకాన్ని సీఎం జగన్కు చూపిస్తూ మురిసిపోయారు. అనంతరం ఒక బ్యాడ్మింటన్ బ్యాటును సీఎంకు బహుకరించారు.