1984లో ఆసియాకప్ టోర్నీ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 14 సార్లు జరిగిన ఈ టోర్నీని టీమిండియా అత్యధికంగా 7 సార్లు కైవసం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఐదు సార్లు టోర్నీని సొంతం చేసుకుంది. పాకిస్థాన్ జట్టు రెండు సార్లు ఛాంపియన్గా నిలిచింది. మొదటి ఆసియాకప్ని గవాస్కర్ సారథ్యంలోని టీమిండియా గెలిస్తే... 14వ ఆసియాకప్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో కైవసం చేసుకుంది భారత జట్టు. ఏ జట్టు ఎప్పుడెప్పుడు టైటిల్ సాధించాయంటే...