ఆసియాకప్ ఫైనల్ కోసం రోహిత్ సేన హోటెల్ గది నుంచి బయలుదేరి వెళ్లింది. భారత్, పాకిస్థాన్ మధ్య పోరు చూద్దామనుకున్నవారికి నిరాశే ఎదురైంది. అన్యూహ్యంగా ఫైనల్ చేరిన బంగ్లాదేశ్, టీమిండియాతో ఫైనల్ పోరు కోసం సిద్ధమవుతోంది. గత సీజన్లో కూడా భారత్, బంగ్లా మధ్య ఆసియాకప్ ఫైనల్ జరగడం విశేషం. అయితే ఆసియాకప్‌లో భారత్‌పై ఒక్కసారి ఘనవిజయం సాధించిన రికార్డు బంగ్లాకి ఉండడం వారికి ఊరటనిచ్చే విషయం. ఇరు జట్లు ఫైనల్ పోరు సీరియస్‌గా తీసుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం కనిపిస్తోంది.