ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ అసలు సిసలు వన్డే మజాను రుచి చూపించింది. చివరి బంతిదాకా ఫలితం తేలకుండా ఉత్కంఠ రేపిన ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన భారత జట్టు... ఏడోసారి ఆసియాకప్ గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఆసియాకప్ ప్రారంభమైన 1984 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఏడుసార్లు టోర్నీని గెలుచుకుని, అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టును తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది టీమిండియా. మ్యాచ్ గెలిచిన అనంతరం టీమిండియా సంబరాలు చేసుకుంది.