ఆఫ్గనిస్థాన్ క్రికెటర్ హజ్రతుల్లా జజాయ్ ఓ టీ20 మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాడు. ఆఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో కాబూల్ జ్వానన్, బల్ఖ్ లెజండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హజ్రతుల్లా జజాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ లీగ్‌లో కాబూల్ జ్వానన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హజ్రతుల్లా జజాయ్...బల్ఖ్ లెజండ్స్ స్పిన్నర్ మజారీపై విరుచుకుపడ్డాడు. ఆరు సిక్స్‌లు మాత్రమే కాదు కేవలం 12 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, కరీబియన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో 12 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డ్‌లకెక్కాడు.