ఏ రంగంలో అయినా కొన్ని సెంటిమెంట్స్ కామన్. క్రికెట్లోనూ తాజాగా ఓ సెంటిమెంట్ భారత జట్టును కలవరపెడుతోంది. అదే 321. వన్డేల్లో భారత జట్టు ఈ స్కోర్ సాధించిన ప్రతీసారీ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. మామూలుగా అయితే వన్డేల్లో 300 స్కోర్ దాటితే ఛేజింగ్ టీమ్ గెలవడం కష్టం. అయితే టీమిండియా ఈ స్కోర్ చేసిన రెండు సార్లు ఓడిపోయింది. విశాఖ వన్డేలోనూ ఫలితం ‘టై’గా ముగిసింది.