బ్రెజిల్లో మహా విషాదం చోటు చేసుకుంది. రియో డీ జెనిరోలోని ఫ్లెమెంగో అనే ఓ ఫుట్బాల్ క్లబ్లో రాత్రిపూట మంటలు చెలరేగడంతో.. 10మంది ఫుట్బాల్ ప్లేయర్స్ నిద్రలోనే సజీవ దహనమయ్యారు. వీరంతా టీనేజర్సే కావడం గమనార్హం. ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలవగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.