సచిన్... సచిన్... అని స్టేడియంలో మార్మోగిన పిలుపు విని ఐదేళ్లు అవుతోంది. అవును ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన క్షణాలకు ఐదేళ్లు పూర్తయ్యాయి. వెస్టిండీస్‌తో తన 200వ, చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన సచిన్ టెండుల్కర్ భావోద్వేగంతో 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.