ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌పై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభావంతోనే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. మండలిలో జరిగిన పరిణామాలు ప్రజస్వామానికి ఆందోళన కలిగిస్తున్నాయని.. చాలా రాష్ట్రాల్లో మండలి లేదని ఆయన తెలిపారు. మండలి అవసరమా? అన్నచర్చ జరగాలని అభిప్రాయపడ్డారు అంబటి రాంబాబు.