హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : చంద్రబాబుపై మండిపడ్డ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..

ఆంధ్రప్రదేశ్16:09 PM March 11, 2020

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేతల వాహనం మీద దాడిపై స్పందించారు. టీడీపీ నేతలు పది కార్లలో వచ్చి మాచర్లలో గొడవకు దిగారని పిన్నెల్లి  ఆరోపించారు. చంద్రబాబునాయుడు పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జరిగిన గొడవలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 2014లో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ముస్తఫా మీద టీడీపీ శ్రేణులు దాడులు చేశాయని పిన్నెల్లి గుర్తు చేశారు. తాజాగా, అమరావతి రైతుల పేరుతో కొందరు టీడీపీ నేతలు తనను కూడా హత్య చేయడానికి కుట్ర పన్నారని పిన్నెల్లి ఆరోపించారు. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము సంయమనంతో వ్యవహరించామని, వారే గూండాలను పంపి ప్రశాంతమైన పల్నాడులో అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading