తన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలని.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి గవర్నర్ను కలిసిన ఆయన.. వైఎస్ వివేకా హత్యపై ఫిర్యాదు చేశారు. హత్య గావించబడింది మామూలు వ్యక్తి కాదని.. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా పనిచేశారని.. అది పట్టించుకోకుండా ప్రభుత్వం సాధారణ కేసుగా భావిస్తోందని ఆరోపించారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.