హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : కర్ణాటక ముఖ్య‌మంత్రిగా నాలుగోసారి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

జాతీయం20:01 PM July 26, 2019

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో యడ్యూరప్ప ఒక్కరే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా.. యడ్యూరప్పతో ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులు ఎవ్వరూ ప్రమాణస్వీకారం చేయలేదు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ కర్ణాటక ఇన్‌చార్జి మురళీధర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల నేతలు గైర్హాజరయ్యారు. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగో సారి. 2007లో మొదటిసారి, 2008లో రెండోసారి, 2018లో మూడోసారి, ఇప్పుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading