ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వైసీపీ రాజ్యసభ అభ్యర్థి, వ్యాపారవేత్త పరిమళ్ నత్వానీ అన్నారు. వైసీపీ తరఫున ఆయన రాజ్యసభకు నామినేషన్ వేశారు. వైబ్రెంట్ గుజరాత్ లాంటి కార్యక్రమాల నిర్వహణలో తనకు అనుభవం ఉందని, 12 దేశాల్లో తాను పని చేశానని చెప్పారు.. తన అనుభవంతో ఏపీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.