అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ హోస్టన్‌లో ప్రసంగిస్తూ ఆర్టికల్ 370 రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370కు ఫేర్ వేల్ ఇచ్చేశామన్నారు. ఆర్టికల్ 370 ఇప్పటివరకు జమ్ముకాశ్మీర్ ప్రజలు అభివృద్ధి కాకుండా అడ్డుకుందన్నారు. దీనివల్లే అక్కడ ఉగ్రవాదం పెరిగిందన్నారు. మిగిలిన భారతీయులకు రాజ్యాంగం ఎలాంటి అధికారం కల్పిస్తుందో ఇప్పుడు జమ్ముకాశ్మీర్ లడఖ్ ప్రజలకు కూడా అవే అధికారాలు దక్కాయన్నారు.