టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎదుట ఉత్తమ్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మౌనపోరాటానికి దిగారు. స్పీకర్ అపాయింట్మెంట్ కోరితే అందుబాటులో లేరని చెబుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆయన ఏ రహస్య ప్రాంతంలో కలిశారని విరుచుకుపడ్డారు. స్పీకర్ కనబడుట లేదని.. ఎవరికైనా తెలిస్తే తమకు చెప్పాలని ఎద్దేవా చేశారు ఉత్తమ్.