హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.మాజీ సీఎం చంద్రబాబు నివాసాన్ని రాజ్‌భవన్‌గా మార్చడంతో.. అందులోనేే ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమితులైన మొదటి గవర్నర్ బిశ్వభూషణే కావడం విశేషం. గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌,పలువురు రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు,హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

webtech_news18